Monday, June 25, 2012

దత్తపది - 1

"అక్క - అన్న - వదిన - మామ" అనే పదాలను ఉపయోగిస్తూ  
రావణునకు మండోదరి చేసిన హితబోధను తెలుపుతూ  
నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయటం 
(25.06.2012)

అక్కట! నాశనకారణ
మిక్కాంతను దెచ్చుటన్న నీయమ నీకున్
దక్కదు  నీవది నమ్మిన
నక్కఱపడు  మామకీనమౌ వాక్యంబుల్.


కంది - పెసర - సెనగ - మినుము
పై పదాలను ఉపయోగిస్తూ  నచ్చిన ఛందస్సులో
పార్వతీకళ్యాణము గురించి పద్యం .
(07.05.2013) 
కాంత ముఖమది సిగ్గున కందియుండ
నందరాపె సరణులకు నబ్బురపడ
శివుడు ముడివేసె, నగజాత శిరసువంచె
వరుస మినుముట్టె జయజయ ధ్వానమపుడు.

గిరిజ పెండ్లి నాడు ధరణీధరుండంత
కంది పెసర సెనగ లందముగను
మినుములాదు లింక మేలైన పప్పులన్
వంటలందు గూర్చె వైభవముగ.  

1 comment:

  1. వి ఎస్ ఎన్ ఎం హరి గారు,

    మీ పద్యాలు అద్భుతంగా వున్నాయి. దయ చేసి మీ ఫొను సంఖ్య, చిరునామా, ఇమైల్ ఐడి తక్షణమే మాకు
    పంపండి. cpbrownsevasamithi@yahoo.com

    నమస్కారములతో

    నిమ్మగడ్డ చంద్ర శేఖర్
    9845717166 బెంగలూరు

    ReplyDelete