రామా! నీకృప గల్గెనేని ఘనుడై రాణించు, సత్సౌఖ్యముల్
భూమీశాది సమస్తసంపద లికన్ పూర్ణాయురారోగ్యముల్
క్షేమంబుల్, సుగుణంబులందుచు సదా శ్రీమంతుడై యెల్లెడన్
నామౌన్నత్యము గాంచు మానవుడిలన్ నైర్మల్యతన్ రాఘవా!
శ్రీమత్కోసలరాజశేఖర! ప్రభూ! సీతామనో(సతీ)వల్లభా!
స్వామీ! భక్తులపాలి కల్పతరువై సత్సంపదల్ నిత్యమున్
భూమిం బంచుచు భారతీయులకికన్ భోగంబు లందించుచున్
రామా! సాధుగుణంబు లిమ్ము దయతో రాజేంద్ర! హే రాఘవా!

శా.
రామా! నీపదధూళిసోకినశిలన్ రమ్యాతిరమ్యంబుగన్
రామాకారిణిగా నొనర్చి యఘసంత్రాసమ్మునుం గూల్చి సత్
క్షేమంబందగజేయు నీమహిమకున్ 'జే'యందు సద్భక్తితో
బ్రేమంజూపి యనుగ్రహించు మిపుడీ భీతున్ భవద్భక్తునిన్.
ఉ.
ఈతని బోలు దైవమిల నెందును లేడు మమత్వదీప్తితో
నీతని గొల్చువారలకు నిచ్చుచు నుండు సమస్తసౌఖ్యముల్
రాతిని నాతి జేసి శుభరాశిని గూర్చి ముదంబు గొల్పె, నే
నాతని భక్తితో దలతు నారఘురాముని వత్సలాఢ్యునిన్.
ఆత డనంతశక్తియుతు డాతని సన్మహిమావిశేషముల్
చేతము సంతసిల్లు విన, జిత్సుఖ మందును వాస్తవమ్ము నా
డాతని పాదధూళి కణ మాశిల నచ్చెరువంద నింతిగా
భూతలినిన్ బొనర్చి కడుపోడిమి నింపెను వాని కంజలుల్.
మానక నిను నే గొలిచెద
నీనామమె దలచువాడ నిత్యము రామా!
నానావిధ సంకటముల
తోనిండిన బ్రతుకులోన దుష్టిని గాంచన్.
శా.
సామీప్యంబున జేరబోదఘము లేశంబైన శ్రీరామునిన్
క్షేమాకారుని భక్తితో గొలిచినన్ శ్రీలందు నిత్యమ్ముగా
భూమిన్ సౌఖ్యము లందుచుండు నిజమో పుణ్యాత్ముల వ్వాని స
న్నామంబున్ స్మరియింపు డెల్లెడల సన్మానంబులన్ గాంచగన్.
ల..
లలితాకారము సద్గుణప్రకరమున్ రాజీవనేత్రంబులున్
కలుషాహంకృతిజూపువారలపయిన్ గ్రౌర్యమ్ము వీరత్వమున్
నెలవైయుండిన రాఘవేంద్ర! వినుమా నిన్గొల్తు నిత్యమ్ము నా
ఖలతాసంస్కృతి ద్రుంచి కావవలయున్ గారుణ్యరత్నాకరా!
శా.
వైకుంఠున్ గరుణావిశేషనిలయున్ భాగ్యప్రదున్ శాశ్వతున్
శ్రీకంఠాదిసమస్తదేవవినుతున్ జిన్మూర్తినిన్ జిష్ణునిన్
లోకార్త్త్యంతకు ధర్మరక్షకు నజున్ లోకైకవీరున్ బ్రభున్
చీకాకుల్ దొలగించి గాచుటకునై "జే"యంచు
బ్రార్థించెదన్.
No comments:
Post a Comment